Monday, January 3, 2011

MADDELA CHERUVU SURI WAS LEFT





హైదరాబాద్: కాల్పుల్లో గాయపడ్డ గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే డాక్లర్లు ధృవీకరించలేదు. ఇక రాయలసీమ ఫ్యాక్షన్ చరిత్రలో సూరి శకం ముగిసింది. సూరి జీవితం అనేక సంఘటనలకు, సంచలనాలకు మారుపేరు. జూబ్లీ హిల్స్ కారుబాంబు కేసులో సూరి శిక్ష అనుభవించారు. తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి హత్యకేసులో బెయిలుపై బయటకు వచ్చారు. సనత్‌నగర్‌లో సోమవారం మధ్యాహ్నం ఓ లాయర్‌ను కలిసి జూబ్లీహిల్స్ వెడుతుండగా సూరిపై కాల్పులు జరిగాయి. దాంతో సూరి అనుచరుడు వెంటనే అతనిని సమీపంలో వున్న అపోలో ఆస్పత్రికి తరలించారు. బీపీ పల్స్‌రేట్ పడిపోవడం, నిరంతరంగా ముక్కు నుంచి రక్తం కారడం జరిగింది. ఈ ఘటనలో సన్నిహితులే కాల్పులకు పాల్పడినట్టు తెలుస్తోంది.

No comments:

Post a Comment